హైదరాబాద్: వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించడంతో పాటు కెప్టెన్ పేరును వెల్లడించింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడంతో ఆయన అభిమానులు బిసిసిఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గిల్ స్పందించారు. వన్డే జట్టుకు కెప్టెన్ ఉండడం మనేది గొప్ప గౌరవమని తెలిపాడు. దేశ తరఫున జట్టుకు నాయకత్వం వహించడం ఎప్పుడూ గర్వ కారణం అవుతుందన్నారు. తమ లక్ష్యం 2027లో వన్డే వరల్డ్ కప్ గెలవడమేనన్నారు. వరల్ కప్ వరకు 20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని, అత్యుత్తమ ఆట ప్రదర్శన చేస్తామని వెల్లడించారు. దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే ప్రపంచ కప్ నాటికి పూర్తి స్థాయిలో సన్నదమవుతామని గిల్ స్పష్టం చేశారు.