మిరాయ్ భారీ విజయం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో సినిమాటిక్ స్పెక్టికల్ ‘రాజు గారి గది 4: శ్రీచక్రం’తో రెడీ అవుతోంది. రాజు గారి గదిని కల్ట్ హారర్-కామెడీ ఫ్రాంచైజీగా మార్చిన విజనరీ ఫిల్మ్ మేకర్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ నాలుగవ భాగం ఈ సిరీస్‌ను నెక్స్ లెవల్ కి తీసుకెళ్లనుంది. దసరా శుభ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రకటించింది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎర్రటి చీరలో ఒక మహిళ, ఉగ్రమైన, దైవిక కాళిని గుర్తుచేసే దేవత విగ్రహం ముందు ఎగురుతోంది. ఈ చిత్రం యూత్, కుటుంబ ప్రేక్షకులను అలరించే మాస్ థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం దసరా 2026కి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.