ముంబై: అక్టోబర్ 19 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించి జట్టును బిసిసిఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టులో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు సెలక్టర్లు షాక్ ఇచ్చారు. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానం శుభ్‌మాన్ గిల్‌ను సారథిగా నియమించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఈ పర్యటనకు వెళ్లే జట్టులో చోటు కల్పించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్, కోహ్లీలను మైదానంలో చూడలేదు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రో-కోలు టెస్ట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో వీరిద్దరు లేకుండానే టీం ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్‌కి కూడా రోహిత్ స్థానంలో శుభ్‌మాన్ గిల్‌నే కెప్టెన్‌గా నియమించారు. ఇఫ్పుడు వన్డేల నుంచి రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20లు ఆడనుంది. ఆక్టోబర్ 19 నుంచి వన్డేలు, అక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.