మన తెలంగాణ/హైదరాబాద్ : తమ క్లయింట్లు పార్టీ మారలేదని, వంద శాతం బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట వాదన వినిపించారు. స్పీకర్ తదుపరి విచారణ ను ఈనెల 24కు వాయిదా వేశారు. పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దా ఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మూ డు నెలల్లోగా విచారణ చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పీకర్‌కు సూచన చేసింది. దీంతో స్పీకర్ ఆఫీస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మరి కొంత గడువు కోరగా, మిగతా ఎమ్మెల్యేలు స మాధానలిచ్చారు. ఈ మేరకు స్పీకర్ విచారణ ప్రారంభించారు.అందులోభాగంగానేశనివారం ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల న్యాయవాదులను, పిటిషనర్ల తరపు న్యాయవాదులు
అనేక ప్రశ్నలు సంధించారు. పార్టీ మారినప్పుడు ముఖ్యమంత్రి కండువా కప్పడం, ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రభుత్వం చేపట్టినందున తామూ భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మీడియా ప్రతినిధుల ముందు చెప్పిన పత్రిక, వీడియో క్లిప్పింగుల గురించి పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. అయితే పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు పరిగణలోకి తీసుకోరాదని ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు సమాధానమిచ్చారు. గంటకు పైగా స్పీకర్ సమక్షంలో న్యాయవాదులు వాదన వినిపించారు. ఇదిలాఉండగా విచారణ పూర్తయి న అనంతరం బిఆర్‌ఎస్ పిటిషనర్ల తరపు న్యాయవాది సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలైన గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యిందన్నారు. ఇప్పటికే అనేక సాక్షాధారాలు స్పీకర్‌కు అందజేశామని ఆయన తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై విచారణను ఎదుర్కొవాలో చెప్పడం మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయని ఆయన చెప్పారు. ఇంకా కొంత మంది సా క్షులను స్పీకర్ ముందుకు తీసుకుని రావాల్సి ఉం దన్నారు. అందుకే స్పీకర్ ఈ నెల ఇరవై నాలుగో తేదీకి విచారణ వాయిదా వేశారని ఆయన తెలిపారు. కాగా ఎమ్మెల్యేలు ఇంకా తాము పార్టీ ఫిరాయించలేదని చెబుతున్నారని ఆయన చెప్పారు. ఏది అడిగినా తమకు సంబంధం లేదంటూ దాట వేశారని ఆయన తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళితే తమకు అభ్యంతరం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారని అడ్వకేట్ సోమా భరత్ ప్రశ్నించారు.