అమరావతి: అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసిపి హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ. 15 వేలు చొప్పున జమ చేస్తున్నామని, అధికారంలోకి వచ్చేనాటికి వ్యవస్థలన్నీ ఆగమ్యగోచరం అని తెలియజేశారు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్డు బాగుచేశామని, స్త్రీశక్తికి ముందే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.