అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం 220 పరుగుల ఆధిక్యంలో ఉంది. చంద్రపాల్ 8 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టడంతో తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. జాన్ క్యాంప్‌బెల్ 14 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బ్రండన్ కింగ్ ఐదు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోస్టన్ చేజ్ ఒక పరుగు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. షాయ్ హోప్ ఒక పరుగు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అలిక్ అతాంజే(27), జస్టిన్ గ్రీవ్స్(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో ఒక వికెట్ తీశారు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 162
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 448/5 డిక్లేర్డ్