మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చి న జీఎస్టీ 2.0 ఫలాలు సంపన్నులకు మోదంగా, సామాన్యులకు ఖేదంగా మిగులుతున్నాయి. తగ్గిన కొత్త ధరలను వ్యాపారులు అమలు చేయడం లే దని ప్రజలు కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో కొత్త స్టాక్ వస్తే తప్ప తగ్గింపు ధర అమలు కాబోదని వ్యాపారులు పేర్కొంటుండడం విశేషం. గత నెల 22వ తేదీ నుంచే తగ్గిన జీఎస్టీ రేట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, చాలా ప్రాంతాల్లో వ్యాపారులు పాత ధరలనే కొనసాగిస్తున్నారని భారీగా ప్ర జల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేం ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమల్లో భాగంగా మొత్తం 357 రకాల వస్తువులపై రేట్లు త గ్గాయి. శ్లాబుల కుదింపులో భాగంగా నిత్యావసరా లు, ఆరోగ్య బీమా, పిల్లల పుస్తకాలు, చేనేత వస్త్రా లు, ఆన్‌లైన్ డెలివరీ సేవలపై పన్ను శాతం మరింతగా పెరగ్గా, మరోవైపు జిఎస్టీ తగ్గిన వస్తువులను పాతధరకే వ్యాపారులు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు కేంద్రానికి అందుతుండడం విశేషం. కొత్త జీఎస్టీ 2.0 ప్రకారం చక్కెర, కొబ్బరి, కాఫీ, నమ్కీ న్, భుజియా, తొక్కులు (ఊరగాయలు), టూత్ పౌడర్, బేకింగ్ పౌడర్, చాక్లెట్లు, బిస్కెట్లు, బాదం, పిస్తా, కర్జూరం, కొవ్వొత్తులు, అంజీర్, వెన్న, నె య్యి, చీజ్ తదితరాలు 12 శాతం నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి దిగి వచ్చాయి. వీటితో పాటు సబ్బులు, టూత్‌పేస్టు, టూత్ బ్రష్‌లు, హెయిర్ ఆయిల్, షాంపూ, టాల్కం, పేస్ పౌడర్, షేవింగ్ క్రిమ్, లోషన్లు కూడా 18 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. గత నెల 22 నుంచే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చినా చాలా చోట్ల అవి అమలు కావడం లేదు. పాత రేట్లనే వ్యాపారులు కొనసాగిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా జిఎస్టీ అ ధికారులకు వేలాదిమంది ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే