అహ్మదాబాద్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్‌తో టీం ఇండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే సరిగ్గా వంద పరుగులు చేసిన కొంత సమయానికే ఔట్ అయ్యాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో సరిగ్గా వంద పరుగులు చేసి రెండుసార్లు ఔట్ అయిన ఏకైక ఆటగాడిగా రాహుల్ రికార్డుల్లోకి ఎక్కాడు. జూలైలో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనూ రాహుల్ సరిగ్గా 100 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 148 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపెయి్ద. 44.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టింీస్ మరోసారి తేలిపోయింది. 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఒక ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.