హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలైంది. తొలి ఆట నుంచి ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నిడివి కారణంగా నేహా శెట్టితో తీసిన ఐటమ్ సాంగ్‌ని చిత్రం నుంచి తొలగించారు. అయితే ప్రేక్షకుల నుంచి ‘ఒజి’కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్‌ను మళ్లీ థియేటర్స్‌లో జత చేశారు. అంతేకాక.. యూట్యూబ్‌లో కూడా ఈ పాటను విడుదల చేశారు.
‘కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ జో సాహిత్యం అందించారు. సోహా, వాగ్దేవి, మధుబంతి బగ్చి ఈ గానాన్ని ఆలపించారు. అరబిక్ పాట స్టైల్‌లో ఈ పాటని తమన్ కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటించగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.