న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇక ముందుకూడా టెర్రరిజానికి సహాయం చేయడం నిలిపివేయని పక్షంలో ప్రపంచపటంలో నుంచి కనుమరుగు కావడం ఖా యం అని భారత సైనిక దళాధిపతి జనరల్ ఉ పేంద్ర ద్వివేదీ హెచ్చరించారు. ఆ విషయంలో ఉ పేక్షించే ప్రసక్తే లేదన్నారు. పాకిస్తాన్ భౌగోళికం గా తన స్థానాన్ని నిలుపుకోవాలంటే.. టెర్రరిజా న్ని స్పాన్సర్ చేసే చర్యలకు స్వస్తి చెప్పాలని హెచ్చరించారు. టెర్రరిస్ట్ లకు వారి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం నిలిపివేయని పక్షంలో ఆపరేషన్ సిందూర్ రెండో విడత మరింత తీవ్రంగా ఉంటుందని,భారతదేశం, సంయమనంతో మౌ నంగా సహించబోదని ఆర్మీ చీఫ్ అన్నారు. రాజస్థాన్‌లోని అనుప్ గఢ్ లోని ఆర్మీ పోస్ట్ లో సైనికదళాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉం డాలని కోరారు. దైవం తలిస్తే.. మీకు మళ్లీ యు ద్ధంలో పాల్గొనే అవకాశం వస్తుంది. మీకు శుభాకాంక్షలు అని జనరల్
ఉపేంద్ర ద్వివేది అన్నారు. మే నెలలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత దళాలు అమెరికా తయారు చేసిన ఎఫ్ -16లు, చైనా కు చెందిన జెఎఫ్ -17తో సహా నాలుగు నుంచి ఐదు పాక్ యుద్ధవిమానాలను కాల్చి వేశాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రకటించిన తర్వాత జనరల్ ద్వివేదీ ఈ హెచ్చరిక చేశారు. పహల్గాంలో టెర్రరిస్ట్ ల 26 మంది టూరిస్ట్ లను హతమార్చిన ఘటనకు ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారీ సైనిక చర్య చేపట్టడం తెలిసిందే. మే 7న భారతదళాలు తీవ్రంగా క్షిపణులతో విరుచుకుపడి , పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశాయి. టెర్రరిస్ట్ శిబిరాలపై దాడి రెండుదేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితులకు దారితీసింది. ఆ సమయంలో భారత వైమానిక దళాలు బ్రహ్మోస్ తో సహా పలు క్షిపణులు ప్రయోగించి పాక్ వైమానిక స్థావరాలను నేలమట్టం చేయడమే కాక, పాక్ కు చెందిన ఐదు ఫైటర్ జెట్ విమానాలను, వైమానిక దళ దాడుల హెచ్చరిక వ్యవస్థను కూడా ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ కాళ్లా వేళ్లా పడడంతో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం ఏ పాకిస్తానీ పౌరుడికి కానీ, సైనిక లక్ష్యాలను కానీ నాశనం చేయకూడదని నిశ్చయించుకుని కేవలం టెర్రరిస్ట్ స్థావరాలు, శిక్షణా కేంద్రాలతో పాటు వాటి సూత్రధారులను నిర్మూలించడంపైనే దృష్టి పెట్టిందని ఆర్మీచీఫ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసం చేసిన టెర్రరిస్ట్ స్థావరాలకు సంబంధించిన అన్ని రుజువులను భారతదేశం ప్రపంచం ముందు ప్రదర్శించగలిగిందని, లేని పక్షంలో పాకిస్తాన్ నిజాలను దాచి పెట్టి ఉండేదని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన బిఎస్ ఎఫ్ 140 బెటాలియన్ కమాండెంట్ ప్రభాకర్ సింగ్, రాజ్ పుతానా రైఫిల్స్ మేజర్ రితేష్ కుమార్, హవల్దార్ మోహిత్ గైరాలను ఆర్మి చీఫ్ స్వయంగా సత్కరించారు.