హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 6 వ తేదీ (సోమవారం) నుంచి జిహెచ్ ఎంసి పరిథితో సహా పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం నగరంలోని చింతల్, నిజాంపేట బాచుపల్లి ప్రాంతంలో ఉన్న 22 రెసిడెన్షియల్ ప్లాట్లు ,ఫ్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను గత నెల 15 తేదీన జారీ చేశారు. చింతల్ ప్రాంతంలో 18 ఎంఐజి, హెచ్ ఐజి ప్లాట్లు, నిజాం పేట బాచుపల్లిలో 4 ఫ్లాట్లను బహిరంగ వేలం వేయనున్నారు. ఇటీవల కెపిహెచ్ బి కాలనీ ప్రాంతంలో హౌసింగ్ బోర్డు పలు దఫాలుగా నిర్వహించిన భూముల విక్రయాల్లో ఎకరా భూమి సుమారు 70 కోట్లకు ఇ-వేలం ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెపిహెచ్ బి కాలనీలో నాలుగు కమర్షియల్ ప్లాట్లను అక్టోబర్ 7, 8 తేదీల్లో ఇ- వేలం ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు. ఫేజ్ 1, 2 పరిధిలో ఉన్న 6చ549 చదరపు గజాలతో పాటు, 2,420 చదరపు గజాలు, 2,397 చదదపు గజాలు,
726 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు మంగళవారం ఇ -వేలం నిర్వహిస్తున్నారు. అలాగే నాంపల్లి ప్రాంతంలోని 1,148 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ ను కూడా 8వ తేదీన ఇ -వేలం ద్వారానే విక్రయిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు అక్టోబరు 9, 10 తేదీల్లో చింతల్ లోని 10,890 చదరపు గజాల కమర్షియల్ భూమి, మహేశ్వరం మండలంలోని రావిర్యాల ప్రాంతంలోని 13,503 చదరపు గజాలు, 5,953.20 చదరపు గజాలు, 3,630 చదరపు గజాల విస్తీర్ణంలోని భూములను కూడా ఇ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇవే కాకుండా వచ్చే పది రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో సంగారెడ్డి – సదాశివపేటలోని ప్లాట్లు, జోగులాంబ గద్వాల,నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన భూములు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే వివిధ రకాల నోటిఫికేషన్లను హౌసింగ్ బోర్డు అధికారులు విడుదల