కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో పెద్దనాన్న లైంగికంగా వేధించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొంపల్లిలోని పోచమ్మగడ్డలో ఓ విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సొంత పెద్దనాన్న నుంచి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో సదరు యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.