మన తెలంగాణ/హైదరాబాద్: కొన్ని నెలల నుంచి తెలుగు సిని మా పరిశ్రమలో విస్త్రత ప్రచారం లో ఉన్న యంగ్ స్టార్ హీరో విజ య్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారానికి ఎట్టకేలకు తెరదించారు. ఇద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. శుక్రవారం నాడు అత్యంత రహస్యంగా, కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని గోప్యంగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలిసింది. ఈ అంశంపై అధికారిక సమాచారం ఒకటి రెండు రోజుల్లో వస్తుందని సమాచారం. ‘గీత గోవిందం’ సినిమాతో వెండితెరపై రాణించిన ఈ జంట, ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మంచి స్నేహితులై, ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’తో వీరి మధ్య బంధం మరింత బలపడి ప్రేమగా మారిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే దానిపై నేరుగా స్పందించకుండా మీడియా ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది, ఇక వచ్చే ఏడాది పెళ్లి జరుగుతుందని తెలిసింది.