మనతెలంగాణ/హైదరాబాద్ : గతేడాది కన్నా ఈసారి మద్యం అమ్మకాలు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏడు శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024 సెప్టెంబర్ లో రూ. 2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ. 3,048 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయని ఎ క్సైజ్ శాఖ పేర్కొంది. 2024లో సెప్టెంబర్ నెలలో 28.81 లక్షల కేసులు ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు జరగ్గా 2025లో 29.92 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2024 లో 39.71 లక్షల కేసుల బీర్లను ఎక్సైజ్ శాఖ విక్రయించగా ఈ సంవత్సరం 36.46 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం.. సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు. అక్టోబర్ 1న రూ.86.23 కోట్ల అమ్మకాలు జరగ్గా, గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు రోజులకు సంబంధించి మద్యం అమ్మకాలు 60 నుంచి 80 శాతంగా పెరిగాయని ఆబ్కారీ శాఖ పేర్కొంది. ఈ మూడురోజులు కలిపి (దసరా పం డుగకు) రూ. 698 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగిందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో (మూడు రోజుల్లో) రూ.530 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. ఈ ఏడాది దసరాకు (ఈ మూడు రోజుల్లో) రూ.698 కోట్ల 33 లక్షల లిక్కర్ విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు.