క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ‘మటన్ సూప్’ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మటన్ సూప్ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. ఈ సినిమాను అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి” అని అన్నారు. దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ “మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా, రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి, హీరో రమణ్, పర్వతనేని రాంబాబు, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.