కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఎ జట్టు ఆటగాళ్లు రాణించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన భారత్ తమ నిర్ణయానికి న్యాయం చేయలేకపోయింది. 45.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, రియాన్ పరాగ్ మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 122 బంతులు ఎదురుకున్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు రియాన్ పరాగ్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అంచనాలు పెట్టుకున్న అభిషేక్ శర్మ(0), ప్రభ్‌సిమ్రన్(1), కెప్టెన్ శ్రేయస్ (8)లు తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో భారత్ 246 పరుగులకే అలౌట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. క్రీజ్‌లో హార్వే(20), ఫ్రేజర్-మెక్‌గుర్క్(28) ఉన్నారు.