భోపాల్: దసరా పండుగ సందర్భంగా దుర్గామాతా నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చెరువులో ట్రాక్టర్ బోల్తాపడడంతో పది మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పంధానాలోని అర్దాలా గ్రామంలో దుర్గామాత నిమజ్జనం కోసం 25 మంది భక్తులు ట్రాక్టర్‌పై విగ్రహాన్ని చెరువు వద్దకు తీసుకెళ్లారు. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో 10 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.