కాంట్రాక్టర్ల స్పందన కరువు
ఎఒసి ప్రత్యామ్నాయ రహదారుల
టెండర్లకు,రసూల్‌పుర టెండర్లకు
ఆదరణ కరువు కాంట్రాక్టులు
దక్కించుకున్నా.. పనులు
ప్రారంభించని గుత్తేదారులు
ఇంకా ప్రారంభం కాని ట్రిపుల్
ఐటి, ఖాజాగూడ, కెబిఆర్ పార్కు
ఫ్లైఓవర్లు 10 నెలలు గడుస్తున్నా..
మొదలు కాని హెచ్‌సిటి పథకాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జీహెచ్‌ఎంసిలో ఓవైపు టెండర్లు జరిగిన ప్రాజెక్టులు పనులకు నోచుకోవడంలేదు.. మరోవైపు పిలిచే టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టాల్సిన ప్రాజెక్టులు ప్రకటనల్లోనే నానుతూ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసి, డి సెంబర్ 5, 2024న రూ. 5942 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీఓ నెం. 627ను విడుదల చేసి 10 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు పనులు కూడా కార్యరూపంలోకి రాలేదనేది కార్పోరేటర్ల నుండి వినిపిస్తున్న ప్రథాన విమర్శ. ఇంకోవైపు రూ. 1090 కోట్లతో కెబిఆర్ పార్కు చుట్టూ 7 ఫ్లైఓవర్‌లు, 7 అండర్‌పాస్‌లు నిర్వహించాలని నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీచేసింది. కానీ, వాటి పనులను కూడా ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రారంభించలేదనీ దీనిపై పలువురు సీనిర్ కార్పోరేటర్లు అసహనం వ్యక్తంచేస్తున్నా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిదిలోని కెబిఆర్ పార్కు చుట్టూర ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులైనా ప్రారంభిస్తే.. జరుగబోయే ఉప ఎన్నిక లో ప్రచారస్త్రాల్లో కీలకమయ్యేదని, కానీ, ప్రాజె క్టు ఇంజనీర్లు వాటిని చేపట్టడంలో
తీవ్ర జాప్యం చేయడంపై పలువురు కార్పోరేటర్లు విమర్శిస్తున్నారు..సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్(ఏఓసి) ప్రాంత రోడ్లకు ప్ర త్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసి టెండర్లను పిలిచింది. వీటి అంచనా వ్యయం రూ.380కోట్లుగా పేర్కొంటూ.. టెం డర్లు దాఖాలు చేసేందుకు సెప్టెంబర్ 2 తుది గ డువుగా నిర్ణయించారు. అయితే, కాంట్రాక్టర్లు టెండర్లలో ఒక్కరు కూడా పాల్గొనకపోవడంతో టెండర్ దాఖలుకు తుది గడవు సెప్టెంబర్ 20 వ రకు పొడిగిస్తూ.. జీహెచ్‌ఎంసి నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, విజయవాడ, వరంగల్, రాజీవ్హ్రదారి జాతీయ రహదారులకు లింక్‌గా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్‌ఆర్)పై ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించడంలో భాగంగా బేగంపేట్ రసూల్‌పురా చౌరస్తాలో ఫ్లైఓవర్‌ను రూ. 48.13 కో ట్లతో నిర్మించాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించి టెం డర్లను పిలిచింది. బేగంపేట్ పోలీసు స్టేషన్ వె నుక వైపు నుండి చౌరస్తాను దాటుతూ రెండుగా చీలి ఒకటి పాటిగడ్డవైపు, రెండోది మినిస్టర్ రో డ్డువైపు నిర్మించేందుకు ప్లాన్ చేశారు. కానీ, ఇక్కడ కూడా ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్‌లో పాల్గొనలేదు. దీంతో ఈ టెండర్‌ను కూడా ఈ నెల 14వ తేదీ వరకు తుది గడువుగా పొడిగిస్తూ జీహెచ్‌ఎంసి ప్రకటనను వెలువరించింది. మరీ పొడిగించిన గడువులోపు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా..? రారా..? అనేది వేచి చూడాలి.
సమీక్షలు చేసినా..
జీహెచ్‌ఎంసిలో చేపట్టాల్సిన, ప్రతిపాదిత ప్రాజెక్టులపై కమిషనర్ కర్ణన్ ప్రతి మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్లానింగ్, భూసేకరణ అధికారులతో కమిషనర్ సమావేశాలను జరుపుతున్నా.. పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా మారిందనే విమర్శలున్నాయి. ఐఐఐటి, ఖాజాగూడ, నానల్ నగర్, ఏఓసి సెంటర్, కెబిఆర్ పార్కు, టివి9ఎన్‌ఎఫ్‌సిఎల్ వెంగళరావు పార్కు వంటివి టెండర్లను పూర్తిచేసుకున్నవి. వీటి పనులు చేపట్టాల్పి ఉంది. కానీ, టెక్నికల్ బిడ్స్, ఫైనాన్షియల్ బిడ్స్, ప్రభుత్వ అనుమతికి వంటి విషయాల నేపథ్యంలో అవి తీవ్ర జాప్యం జరుగుతుంది. గ్రేటర్ నగరాన్ని హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్సపర్మేటివ్, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ (హెచ్‌సిటీ) ప్రాజెక్టు పేరుతో ట్రాఫిక్ సమస్యల రహిత నగరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. 5 ప్యాకేజీలుగా 23 పనులుగా చేపట్టాలని ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం. 627 విడుదల చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సెక్రటరియేట్ ఐమాక్స్ థియేటర్ ముందు వర్చువల్‌గా హెచ్‌సిటీ పనులకు లాంఛనంగా ప్రారంభించారు. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పనులు ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల టెండర్లలో కాంట్రాక్టర్లు కూడా పాల్గొనకపోవడంతో ఈ పథకం పనులు గ్రౌండ్ అయ్యేందుకు మరింత జాప్యం కానున్నట్టు తెలుస్తోంది.