కందుకూరు: నెల్లూరు జిల్లా రాళ్ల పాడు వద్ద దారుణంగా హత్య జరిగింది. కారుతో బైకును ఢీకొట్టి, కిందపడిన వ్యక్తిని తొక్కించి దారుణంగా హత్య చేశాడు. నాయుడు, మరో ఇద్దరు బైక్ పై వెళ్తుండగా కారుతో ప్రసాద్ ఢీకొట్టాడు. అక్కడిక్కడే నాయుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాళ్లపాడు వద్ద జరిగింది.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే దారకాని పాడుకి చెందిన నాయుడు, ప్రసాద్ కు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. వ్యక్తిగత, ఆర్థిక విభేదాలు, వివాహేతర సంబంధం కారణాలతో హత్యజరిగిందని పోలీసులు తెలిపారు.