కాంతారా సినిమా లో ఆదివాసీల దేవతలు అయిన పంజర్ల, గుళిగ దేవతలు ఎవరు? ఎలా ఆదివాసీల జీవితాలలో వెలుగును నింపారు!, అక్కడ ఉన్న రెండు జాతుల మధ్య వైరం, ఆ కాంతారా అడవిలో ఉన్న సంపద కోసం కన్నేసిన రాజుతో ఎలా వైరం వచ్చింది? అనేది ఈ సినిమాలో మనకు పరిచయం చేస్తారు.. ఇది ఇంతకుముందు వచ్చిన కాంతారా సినిమాకు పూర్వపు కథ ప్రీక్వెల్..
బనవాసి ప్రాంతంలో కదంబ రాజులు పరిపాలించే కాలంలో విజయేంద్ర రాజు కాంతారా అడవులలో ఉన్న సుగంధ ద్రవ్యాలు వాటి సంపద కోసం ఆ కాంతారా అడవిని వశం చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అడవిని నాశనం చేయడానికి ఒప్పుకొనని దేవత గుళిగ అతనిని సంహరిస్తుంది. అతని కొడుకు రాజశేఖరుడు రాజు అవుతాడు. అతనికి ఆ కాంతారా అడవుల కథ తెలుసు కాబట్టి అతను జాగ్రత్తగా ఉంటాడు. కానీ అతని కుమారుడు కులశేఖరుడు ఆ అడవిని మరల వశం చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు.. ఆయన కుమార్తె తాంత్రిక విద్యలను అభ్యసించిన కనకవతి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఆదివాసీలలోనే ఇంకో జాతి తెగ ఆ దేవతల మహిమ తెలిసి వాటిని వశం చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళ నుంచి ఎలా ఆ దేవతలను కాంతార ప్రజలు రక్షించుకుంటారు అనేదే సినిమా ప్లాట్..
సినిమా అదిరిపోయే బిగినింగ్ తో ప్రారంభం అవుతుంది.. తర్వాత కొంచెం నిదానంగా ఉన్నట్లు అనిపించినా కానీ వెంట వెంటనే వచ్చే ఫైటింగ్ సీన్స్ మనవల్ని కథలో ఇన్వాల్వ్ చేస్తాయి.. రథం ఫైటింగ్ తో మనము కొంచెం ఇన్వాల్వ్ కాగానే అత్యద్భుతమైన ప్రీ ఇంటర్వెల్ సీను పులితో చేసే సీక్వెన్స్ తో ఇంటర్వెల్ బాష్ మనకు దక్కుతుంది..
ఆ తర్వాత మనకు ఆదివాసీల దేవతల పరిచయము మరియు పరమశివుడు మరియు నందీశ్వరుని సీన్లతో నోరు వెళ్ళబెట్టేలా చేస్తాయి.. రాజును గుళిగ చంపే సీనుతో మనకు గూస్బంస్ వస్తాయి.. ఇది కాంతారా సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ ను గుర్తు చేసినట్లు అనిపిస్తుంది.. కానీ అంతటితో సినిమా అయిపోదు మరలా ఇంకో సీను క్లైమాక్స్ లో మనకు గూస్బంప్ తెప్పిస్తుంది.. చాముండి వచ్చే సీన్ అయితే సూపర్బ్..
విఎఫ్ఎక్స్ బిజిఎం సూపర్ గా ఉంటాయి. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ను అత్యద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మనవల్ని కట్టిపడేస్తాడు. హీరో రిషబ్ శెట్టి ఆహార్యం అతని నటన ఇక చెప్పడానికి మనకు మాటలు రావు చూడాల్సిందే. రుక్మిణి వాసంతి హీరోయిన్ చాలా బాగా నటించింది అందం గా ఉంది. జయరామ్ నటన బాగుంది.
సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కలరిపట్టు విద్యలు గుర్రపు స్వారీలు మనకు కనువిందు చేస్తాయి. సకలేశ్వరపుర అడవులలో తీసిన అడవి దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. ఫోటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. సినిమాలో అక్కడ అక్కడ కన్నడ భాషలోనే వ్యాఖ్యానం ఉంటుంది. దానికి తెలుగు సబ్ టైటిల్స్ వేస్తారు. అదొక్కటే కొంచెం నెగిటివ్ పాయింట్. పాటలు రొమాన్స్ సీన్లు లేవు. అసభ్యమైన సన్నివేశాలు లేవు. ఇంటిల్లిపాది చక్కగా చూడొచ్చు…
సినిమా చాలా బాగుంది.. దానిని మాటలలో చెప్పలేము.. కేవలం అనుభవిస్తేనే ఆ మూడు సీన్లు మనవలని వేరే లోకానికి తీసుకెళ్తాయి..
మామూలుగా ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే డిసప్పాయింట్ అవుతాము అని అంటూ ఉంటాము కానీ మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందాలి అనే ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్ళండి డెఫినెట్గా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది…
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు