’గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగవసారి కలిసి పనిచేస్తున్న హై-ఆక్టేన్ సీక్వెల్ ’అఖండ 2: తాండవం’ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ భారీ అంచనాలను సృష్టించి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. అఖండ 2: తాండవం డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ లాంగ్ హెయిర్, రగ్గడ్ బీర్డ్‌తో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. తమన్ అందిస్తున్న పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హై వోల్టేజ్ ఎనర్జీ అందించబోతోంది.