అహ్మదాబాద్: టీం ఇండియా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌ని డ్రాగా ముగించుకుంది. ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన విషయం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురు లేకుండా దాదాపు 15 సంవత్సరాల భారత్ స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.
ఇంతకు ముందు 5,430 రోజుల క్రితం.. 2011లో ఈ ముగ్గునూ లేకుండా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. తాజాగా ఆసియా కప్ గెలిచి జోష్ మీద ఉన్న భారత్ కేవలం 4 రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్‌లెని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ భారత్ బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోతోంది. 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు నష్టపోయి.. 136 పరుగులు చేసింది.