ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రెపో రేటును 5.50% వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయించిన వెంటనే, అక్టోబర్ 1, బుధవారం నాడు భారత స్టాక్ మార్కెట్ భారీ కొనుగోళ్లతో పుంజుకుంది. సెన్సెక్స్ ఏకంగా 716 పాయింట్లు (0.89%), నిఫ్టీ 50 225 పాయింట్లు (0.92%) పెరిగి ముగిశాయి.