గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చే సింది. మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47 ఓవర్లలో 269/8 రన్స్ చేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి మూడు, శ్రీచరణి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లను పడగొట్టారు. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (43), నీలాక్షి (35) మాత్రమే కాస్త రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను హర్లిన్ డియోల్, ప్రతిక రావల్ ఆదుకున్నారు. రావల్ 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 37 పరుగులు చేసింది. హర్లిన్ ఆరు బౌండరీలతో 48 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21) పరుగులు చేయగా, జెమీమా (0) విఫలమైంది. దీప్తి (53), అమన్‌జోత్ (57) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.