ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు)లో తొలి చిత్రం హనుమాన్ పాన్- ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న నెక్స్ మూవీ మహాకాళి. దీనిని ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర ప్రాధాన్యత ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని ఎంచుకున్నారు. అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందూ పురాణాలలో అసురుల గురువు శుక్రాచార్యుడు గా ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్లు చూపించిన లుక్ అదిరిపోయింది. దేవతలూ – దానవులూ ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా, ఆయనను చిత్రంలో అద్భుతమైన పాత్ర చూపించబోతున్నారు. శుక్రాచార్యుడు కేవలం ఋషి మాత్రమే కాదు, జ్ఞానం, విరోధం, విశ్వాధికారానికి ప్రతీకగా సజీవ చిహ్నంగా చూపించారు.