మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా ‘కొదమసింహం‘ సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990 సంవత్సరం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ‘కొదమసింహం‘ సినిమాను రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. నవంబర్ 21వ తేదీన ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రీ రిలీజ్ చేయబోతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు ఈ ప్రకటన చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్‌గా నటించి ప్రేక్షకుల్ని అలరించిన ‘కొదమసింహం‘ సినిమాలో రాజ్ కోటి మ్యూజిక్, మోహన్ బాబు కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కె. మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. ‘కొదమసింహం‘ ప్రేక్షకుల్ని మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతోంది.