సినిమాలు, ఒటిటి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు.. సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఐబొమ్మ వెబ్‌సైట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్న గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఆ పైరసీ వెబ్‌సైట్ తెలుగులో ఓ ప్రకటనను వెలువరించింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీ ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో పేర్కొంది. దీని వల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్య తరగతివాడే బాధపడుతున్నాడని తెలిపింది. కెమెరాల సాయంతో థియేటర్‌లో మూవీలను రికార్డు చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్‌సైట్లపై దృష్టి పెట్టాలని సూచించింది. తాము ఏ దేశంలో ఉన్న భారత దేశం, అందులోనూ తెలుగు వారి గురించి ఆలోచిస్తామంటూ చెప్పింది.