హైదరాబాద్: అల్లు వాళ్లింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ‘మా తాతగారు అల్లు రామలింగయ్య పుట్టిన రోజున నా హృదయానికి ఎంతో చేరువైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అక్టోబర్ 31వ తేదీన నాకు నయనిక అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుగనుంది. ఈ మధ్యే మరణించిన మా నాన్నమ్మ నాకు పెళ్లి చేయాలని ఎప్పుడు కోరుకునేది. నా మా మధ్య లేకపోయినా.. మా ఈ కొత్త ప్రయాణంలో ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా’’ అని శిరీష్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
శిరీష్ వివాహం గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అయితే శిరీష్ ఎంగేజ్‌మెంట్ చేసుకొనే నయనిక గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.