కాలేజీ లెక్చరర్లు, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధించేందుకు అర్హత కల్పించే టిజిసెట్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత (సిబిటి) విధానంలో డిసెంబర్ రెండోవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్ 2లో 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. ఫీజులో కనీసం 55 శాతం మార్కులు ఉన్నవారు సెట్ రాసేందుకు అర్హులు.