కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర మంత్రివర్గం దీపావళికి ముందు శుభవార్త అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కరవు భత్యాన్ని (Dearness Allowance – DA) 3% పెంచడానికి ఆమోదం లభించింది. ఈ పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 55% నుండి 58%కి చేరుకుంటుంది.