బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో నిన్న రాత్రి ఆయనను బెంగళూరులోని MS రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య బృందాలు వెంటనే ఆయనకు వరుస పరీక్షలు నిర్వహించాయి. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఖర్గే ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే వెల్లడిస్తూ..”ఖర్గే గుండెలో పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు. ప్రణాళికాబద్ధమైన సర్జరీ కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 7న నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఖర్గే పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శస్త్రచికిత్స కారణంగా ఖర్గే బహిరంగ సభకు హాజరయ్యే కాలేకపోవచ్చు.