హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఒజి’. ఈ సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. తాజాగా మెగా కుటుంబమంతా ఈ సినిమాను వీక్షించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్‌కి విందు ఇచ్చారని చిరు పేర్కొన్నారు.
‘‘నా కుటుంబంతో కలిసి ఒజి చూశాను. చిత్రంలోని ప్రతీ అంశాన్ని అస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కిన అద్భుతమైన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రమిది. సినిమాలో భావోద్వేగాలకు లోటులేదు. సినిమాను ఆరంభం నుంచి చివరి వరకూ దర్శకుడు సుజీత్ అద్భుతంగా రూపొందించాడు. కళ్యాణ్ బాబుని స్క్రీన్ మీద చూసి ఎంతో గర్వపడ్డాను. ఆయన తన నటనతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి పెద్ద విందు ఇచ్చారు. తమన్ తన ప్రాణం పెట్టి మ్యూజిక్‌ని అందించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’’ అని చిరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి చిత్రాన్ని చూసినప్పుడు దిగిన ఫోటోలను జత చేశారు.