హీరో విష్ణు విశాల్ నటిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ’ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్‌తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లోకి తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్. జోసెఫ్ జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.