మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు మరోసారి కాలేజీల బంద్‌కు సిద్ధమతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిధులు విడుదల కాకపోవడంతో బంద్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలకు చేపట్టాల్సిన కార్యాచరణకు చర్చించి కాలేజీల బంద్‌పై అధికారిక ప్రకటన చేయనున్నారు. దసరాకు ముందు రూ.600 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పటికీ,ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళన బాట పట్టనున్నాయి.