లండన్: మహాత్మ గాంధీకి లండన్‌లో అవమానం జరిగింది. అక్కడి జాత్యహంకారులు రెచ్చిపోయారు. గాంధీ జయంతి సమీపిస్తున్న తరుణంలో ఆయన విగ్రహంపై పిచ్చి రాతలు రాశారు. ఈ ఘటన లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో చోటు చేసుకుంది. ఇక్క ధాన్యం చేస్తున్నట్లుగా గాంధీ విగ్రహం ఉంది. అక్టోబర్ 2 గాందీ జయంతి జరుగనున్న నేపథ్యంలో ఆయన విగ్రహానికి ఇలా జరగడం బాధకరమని అక్కడి రాయభార కార్యాలయం ఖండించింది.
‘లండన్‌లోని టావిస్టాక్ స్కేర్‌లోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఘటన సిగ్గుచేటు. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవం రోజుకి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విధ్వంసమే కాదు.. మహాత్ముడి వారసత్వంపై దాడి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.