ఐసిసి వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన(8).. జట్టు స్కోరు 14 పరుగులకే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన హార్లిన్ డియోల్ తో కలిసి మరో ఓపెనర్ ప్రతీకా రావల్ జట్టును ముందుకు నడిపించింది. ఇద్దరు శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించిన ప్రతీకా క్యాచ్ ఔట్ అయ్యింది. దీంతో 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులో హార్లిన్ డియోల్(33), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఉన్నారు. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు.