ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లో నటించాలంటే ఆమె పెట్టే కండీషన్లతో దర్శక, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రభాస్ నటిస్తున్న ‘‘స్పిరిట్’ ‘కల్కి-2’ చిత్రాల నుంచి తప్పించారు. అయితే ‘స్పిరిట్’ సినిమాలో ఇప్పటికే త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా అనుకుంటున్నారని టాక్.
అయితే తాజాగా హీరోయిన్ దీపికా చేసిన పనితో ఆమె గురించి మళ్లీ నెట్‌లో చర్చించుకుంటున్నారు. అదేంటంటే ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ను దీపికా అన్‌ఫాలో చేసింది. ఫరా ఖాన్ కూడా దీపికాను అన్‌ఫాలో చేసింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల ఓ షోలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. దీపికా ఎనిమిది గంటల పర్కింగ్ అవర్స్ గురించి కామెంట్ చేసింది. ‘ఆమె ఇప్పుడు పని చేసేదే 8 గంటలు. ఇక ఈ షోకు ఎలా వస్తారు. ఆమెకు అంత టైం ఎక్కడ ఉంది’ అని ఫరా అన్నారు.
దీంతో ఈ మాటలు సరదాగా అన్నప్పటికీ.. బాలీవుడ్‌లో చర్చకు దారి తీశాయి. దీంతో నటి ఫరాను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఫరా దర్శకత్వంలో దీపిక ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాల్లో దీపికా ప్రదాన పాత్రల్లో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతు వచ్చింది. అలాంటిది ఇప్పుడు వీరిద్దరు ఒకరినొకరు అన్‌ఫాలొ చేసుకున్నారు.