పొలం పనికి వెళ్తూ రైతు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మిడ్జిల్ గ్రామానికిచెందిన రాగుల బాలస్వామి (38) వేరొక రైతు పంట పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో గట్టు పైనుంచి కాలుజారి వరి చేనులో బోర్లా పడ్డాడు. బురదలో కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికులు జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. ఒక్కసారిగా ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.