ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా నిలువనుంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడు ప్రపంచకప్ ట్రోఫీలు సాధించిన ఆస్ట్రేలియా మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో కూడా కంగారూ టీమ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇతర జట్లతో పోల్చితే ఆస్ట్రేలియాకే ట్రోఫీ సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యా చ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు.
కెప్టెన్ అలిసా హీలీ ఈసారి కూడా జట్టుకు ప్ర ధాన అస్త్రంగా మారింది. జట్టును ముందుండి నడిపించేందు కు హీలీ సిద్ధమైంది. జార్జియా వొల్, బెథ్ మూనీ, అష్లే గార్డ్‌న ర్, మెక్‌గ్రాత్, సదర్లాండ్, అలనా కింగ్, కిమ్ గార్త్, మెగాన్ షట్, కిమ్ గార్థ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ రాణించినా ఆస్ట్రేలియాకు విజ యం నల్లేరుపై నడకే. ఇక న్యూజిలాండ్ జట్టులో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదనే చెప్పాలి. సుజి బేట్స్; అమెలియా కెర్, మాడి గ్రీన్, సోఫి డివైన్, జార్జియా, జెస్ కెర్, లియా తహుహు తదితరులతో న్యూజిలాండ్ చాలా బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న కివీస్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.