విజయవాడ: ముక్కపచ్చలారని ఓ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. వరుసకు బాబాయ్ అయినప్పటికీ తన వరుస మర్చిపోయి దారుణానికి పాల్పడ్డాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికపై బాబాయి అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడ నగర శివారులోకి పాయకాపురంలో చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చని పోవడంతో.. పిన్ని, బాబాయ్ దగ్గర ఆమె ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో బాబాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక నున్న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనారోగ్యంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.