రైల్వే మంత్రిత్వ శాఖ డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ మేర ) ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 320 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఈ ప్రాజెక్ట్‌తో ఈ విభాగంలో రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరిచే అవకాశం కలుగుతుంది. డోర్నకల్ జంక్షన్ విజయవాడ – కాజీపేట మూడవ లైన్ల విభాగంలో ఉంది. ఇది రద్దీగాఉండే గ్రాండ్- ట్రంక్ మార్గంలో వస్తుంది. విజయవాడకాజీపేట సెక్షన్‌ను నాలుగు లైన్లకు పెంచే ప్రతిపాదన పురోగతిలో ఉంది. ఈ జంక్షన్‌లోని రైళ్లు విజయవాడ, కాజీపేట దిశకు అదనంగా భద్రాచలం వైపు నడుస్తాయి. విజయవాడ, భద్రాచలం మధ్య రైలు రాకపోకలను సులభతరం చేయడానికి డోర్నకల్ జంక్షన్ వద్ద బై-పాస్ లైన్ నిర్మించబడింది.
అయితే, విజయవాడ నుండి భద్రాచలం వైపు రైళ్ల రాకపోకలు స్టేషన్ మీదుగా క్రాసింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా రైళ్లు నిలుపుదల చేయాల్సి వస్తోంది. ఇప్పుడు డోర్నకల్ వద్ద ప్రతిపాదించబడిన 10.5 కిలోమీటర్ల దూరం గల రైల్ ఓవర్ రైలు, విజయవాడ నుండి డోర్నకల్ మీదుగా భద్రాచలం రోడ్డుకు వెళ్లే రైళ్ల క్రాస్ మూవ్మెంట్ ను నివారిస్తుంది. ఇది రైళ్లను నిలుపుదల చేయకుండా, ఈ విభాగంలో రైళ్లు సజావుగా నడిచేలా చేస్తుంది. డోర్నకల్ వద్ద ఉన్న రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్ట్, లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కీలకమైన విభాగంలో రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టడానికి, నడుపడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భద్రాచలం, పరిసర ప్రాంతాల బొగ్గు బెల్ట్ ప్రాంతం నుండి బొగ్గు రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.