అమరావతి: తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఎపి సిఎం చంద్రబాబు నాయుడే అని ఎపి మంత్రి గొట్టిపాటి
రవికుమార్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. ఈ సందర్భంగా
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనైతిక విధానాలతో ప్రజలపై మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 18 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు.
జగన్ పాపాలను భరిస్తూనే ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, జగన్ పిపిఎ రద్దు చేయడం వల్ల
ఉత్పత్తైన విద్యుత్ ను వాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా ఉత్పత్తిపైనా
దృష్టి సారిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింతగా ఛార్జీలు తగ్గిస్తామని గొట్టిపాటి రవి కుమార్ తెలియజేశారు.