హైదరాబాద్ : ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇవ్వని పార్టీ బిఆర్ఎస్ అని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బిఆర్ఎస్
ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..10 ఏళ్లు నిజాం నవాబులను
మించిన పాలన చేశారని, వందలకోట్ల అప్పులు పెట్టిన బిఆర్ఎస్ తమ గురించి మాట్లాడుతుందా? అని ప్రశ్నించారు. దళిత బంధును
ఎక్కడ అమలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్ని మాజీ సిఎం కెసిఆర్ నెరవేర్చారా? అని మహేష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై
టిఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కు లేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు
పంచుతున్నారని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లకు పైగా గెలుస్తామని సవాల్ విసిరారు. బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రం దగ్గర
పెండింగ్ లో ఉన్నాయని తెలిజేశారు. బిజెపి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ లను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.
యూరియాపై బిజెపిని బిఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.