టీమిండియాకు శ్రీలంక స్పిన్నర్ ఇనోక రణవీర బిగ్ షాకిచ్చింది. ఒకే ఓవర్ లో మూడు కీలక వికెట్లు తీసి భారత్ ను దెబ్బ కొట్టింది. ఇన్నింగ్స్ 26వ ఓవర్ లో హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న హార్లీన్ డియోల్ (48)ను తొలుత ఔట్ చేసిన రణవీర.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ ను డకౌట్ చేసింది. ఇక, ఆ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(22)ను పెవిలియన్ పంపి భారత్ ను కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (2) కూడా ఔట్ కావడంతో భారత్ 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో దీప్తి శర్మ(21), అమన్ జోత్(20)లు ఉన్నారు.