ఆసియాకప్ విజయంతో టీం ఇండియా ఫుల్ జోష్‌లో ఉంది. అయితే త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆసియాకప్‌లో గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌లో హార్థిక్ అడలేదు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు. హార్థిక్ ఎడమ తొడ భాగంలో గాయమైనట్లు సమాచారం. వైద్యులు అతడిని నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
డాక్టర్లు చెప్పినట్లు నాలుగు వారాల్లో హార్థిక్ కోలుకుంటే ఆసీస్‌తో జరగబోయే సిరీస్‌లో అతడు ఆడే అవకాశం ఉంది. భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగుతాయి. ఇక వేళ గాయం కారణంగా హార్థిక్ వన్డేలకు దూరమైనా.. టి-20 సిరీస్‌కి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియాల మధ్య అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాగా.. 29 అక్టోబర్ నుంచి టి-20 ప్రారంభం అవుతుంది.