బ్రోకరేజ్ దిగ్గజం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ తన ఐపీఓ ఇష్యూ ధరపై 4.35% ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించింది. ఒక్కో షేరు రూ. 414 ఇష్యూ ధర కాగా, ఎన్‌ఎస్‌ఈలో రూ. 432 వద్ద లిస్ట్ అయింది. ఐపీఓకు 20.66 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది.