హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా బిఆర్ఎస్ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీవరకు ఏ ఎన్నికైనా బిఆర్ఎస్ అనుకూలమేనని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను గుర్తుచేసేందుకు.. తాము ‘ బాకీ కార్డులను‘ తీసుకువచ్చాం అని తెలియజేశారు. బాకీ కార్డుల’ ద్వారా కాంగ్రెస్ బాకీలను ఇంటింటికీ చేర్చడానికి ఉద్యమించామని, ‘బాకీ కార్డులు’ ఇంటింటికి తీసుకోకపోతే.. అదే మనకు బ్రహ్మాస్తం అని కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ ను తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టలేదని విమర్శించారు. మున్సిపల్ శాఖ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కెటిఆర్ దుయ్యబట్టారు.