దుబాయి వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన తెలుగుతేజం తిలక్‌వర్మ సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిలక్‌కు ఘన స్వాగతం లభించింది. శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి స్వాగతం పలికారు. తిలక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.