ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. తొమ్మిదోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ విజయంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో మరో బ్యాటర్ పేరు కూడా మారుమోగిపోతుంది. అతడే రింకూ సింగ్. హార్థిక్ పాండ్యాకు గాయం కావడంతో జట్టులోకి వచ్చి రింకూ.. మ్యాచ్ విజయానికి అవసరమైన చివరి పరుగులు చేశాడు. మొత్తం టోర్నమెంట్‌లో కేవలం ఒక బంతిని మాత్రమే ఎదురుకొని.. ఫోర్‌తో జట్టును గెలిపించాడు.
అయితే ఇక్క మరో ట్విస్ట్ ఉంది. రింకూ సింగ్ గతంలో తాను చెప్పిన విషయాన్నే ఫైనల్‌లో చేసి చూపించాడని యాంకర్ సంజనా గణేషన్ బయటపెట్టింది. ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి మొదలైంది. అంతకు మూడు రోజుల ముందే 6 తేదీన రింకూ సింగ్ ఫైనల్‌లో విన్నింగ్ రన్స్ తానే చేస్తానంటూ ఓ పేపర్ మీద రాసిచ్చాడట. ఇప్పుడు సరిగ్గా అదే జరిగిందని సంజనా వివరించింది. తిలక్ వర్మపై కూడా అప్పుడే అంచనా వేసినట్లు ఆమె పేర్కొంది. విలువైన ఇన్నింగ్స్ ఆడేస్తానని అతడు కూడా చీటీలో రాసి ఇవ్వడం గమనార్హం.