మోగిన స్థానిక ఎన్నికల నగారా
అక్టోబర్ 9న స్థానిక సంస్థల
ఎన్నికలకు నోటిఫికేషన్
రెండు విడతల్లో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు
అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు
తొలి విడత నోటిఫికేషన్
ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపిటిజి, జెడ్‌పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది. ఈ మేరకు సోమవారం డిజిపి జితేందర్, అడిషనల్ డిజిపి మహేష్ భగవత్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యద్శి శ్రీధర్, కమిషనర్ సృజన తదితరులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) రాణికుముదిని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి రెండు దశల్లో ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.
ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదేరోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపిటిసి, 565 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణికుముదిని వివరించారు.
ముఖ్యమైన తేదీలివే..
ఎంపిటిసి, జెడ్‌పిటిసి, ఎన్నికలు- తొలివిడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- :అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- :అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- : నవంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభం
ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు- రెండో విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన: అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ :- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- : అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- : నవంబర్ 11 ఉదయం 8 గంటలకు ప్రారంభం
గ్రామ పంచాయతీ ఎన్నికలు- తొలి విడత
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
పరిశీలన: అక్టోబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ-: అక్టోబర్ 23
ఎన్నికల తేదీ, ఫలితాలు- : అక్టోబర్ 31
గ్రామ పంచాయతీ ఎన్నికలు -రెండో విడత
నామినేషన్ల స్వీకరణ- :అక్టోబర్ 21
చివరి తేదీ: అక్టోబర్ 23
పరిశీలన: అక్టోబర్ 24
నామినేషన్ల ఉపసంహరణ:- అక్టోబర్ 27
ఎన్నికల తేదీ, ఫలితాలు-: నవంబర్ 4
గ్రామ పంచాయతీ ఎన్నికలు -మూడో విడత
నామినేషన్ల స్వీకరణ- : అక్టోబర్ 25
చివరి తేదీ: అక్టోబర్ 27
పరిశీలన: అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ- :అక్టోబర్ 31
ఎన్నికల తేదీ, ఫలితాలు :- నవంబర్ 8
తెలంగాణలో గ్రామీణ జిల్లాలు :- 31
మండలాలు :-565
జెడ్‌పిటిసి స్థానాలు : 565
ఎంపిటిసి స్థానాలు :- 5749
ఎంపిటిసి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు :- 31,300
జెడ్‌పిటిసి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు :- 15,302
మొత్తం గ్రామపంచాయతీలు : – 12,733
మొత్తం వార్డుల సంఖ్య -: 1,12,288
మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య :- 1,12,474
గ్రామపంచాయతీల కోసం పోలింగ్ స్టేషన్ల సంఖ్య :- 15,522
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య – 16,703,168
పురుష ఓటర్లు – 81,65,894
మహిళా ఓటర్లు – 85,36,770
ఇతరులు : 504